కారేపల్లి, మహా: కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన జోగ మల్లమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సహకారంతో మంజూరైన 48 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం స్థానిక సర్పంచ్ మూడ్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ చేతుల మీదుగా బాధితురాలు మల్లమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పేదలు కూడా మెరుగైన వైద్యం పొందాలనే ఉద్దేశంతో, వారికి వైద్యం ఆర్థికంగా భారం కాకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితులకు సహాయం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్మీరా ఈర్యా, సురేందర్ రెడ్డి ,బాణోత్ నవీన్, కుంజా రామకృష్ణ ,అజ్మీరా సుమన్, మూడ్ కిరణ్ పాల్గొన్నారు.
Post Views: 93








