- ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో వినూత్నంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 50 పేద విద్యార్థులకు ఫీజు లు చెల్లిస్తాం -బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి
మెల్బోర్న్ నగరంలో వంద కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్లపై “హ్యాపీ బర్త్‌డే కేటీఆర్”, “బీఆర్ఎస్ ఆస్ట్రేలియా” అనే సందేశాలతో అలంకరించి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ నగరం మొత్తం గులాబీ జెండాలతో సందడి చేసింది.
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం తెలంగాణ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. మెల్బోర్న్లో నిర్వహించిన కార్ల ర్యాలీ స్థానికంగా ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, కాన్బెర్ర , అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో కూడా కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
సిడ్నీలో రాజేష్ గిరి రాపోలు, బ్రిస్బేన్‌లో విన్నీ తుముకుంట, క్యాన్బెరాలో ఝాన్సీసాయల, అడిలైడ్‌లో చంద్ర శేఖర్ మరియు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల తమ అనుబంధాన్ని చాటుకుంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ చేపట్టిన “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తరఫున యాభై మంది పేద విద్యార్థుల ఏడాది విద్యా ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. సమాజ సేవను రాజకీయాలకు అనుసంధానం చేసిన నాయకుడు కేటీఆర్ అని ఆయన కొనియాడారు.
అలాగే, కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరామ్ ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, ఉదయ్ సింహా రెడ్డి, విశ్వామిత్ర, మంతి ప్రగడ, సతీష్ పులిపాక తదితరులు పాల్గొన్నారు. భారీ కార్ల ర్యాలీతో మెల్బోర్న్లో బీఆర్ఎస్ శ్రేణులు సృష్టించిన సందడి కేటీఆర్ జన్మదిన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








