Mahaa Daily Exclusive

  రవి నాయక్ నా సోదరుడితో సమానం.

Share

  • కంటతడి పెట్టుకున్న సీనియర్ ప్రముఖ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు
  • రవికీ కారేపల్లి ప్రముఖులు నివాళి.
  • రవి నాయక్ మృతి న్యాయవ్యవస్థకు తీరని లోటు అజ్మీరా వీరన్న.

కారేపల్లి, మహా:సీనియర్ న్యాయవాది ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవి నాయక్ మృతి చాలా బాధాకరమని సీనియర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది రవి నాయక్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. శనివారం మృతుడు రవి నాయక్ దశదిన కార్యక్రమంలో కారేపల్లి మండలానికి చెందిన ప్రముఖులు పాల్గొని రవి నాయక్ చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రవి నాయక్ తన వద్ద చిన్న వయసులో అడ్వకేట్ గా పనిచేశారని, తనకు తమ్ముడు లాంటివాడని అందరితో కలుపుకొని పోయే రవి చనిపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన అతను చిన్న వయసులోనే న్యాయవాధిగా వృత్తిని కొనసాగుతూ అంచలంచలుగా ఎదిగి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా కాలం పాటు పని చేశారని గుర్తు చేశారు. ఇల్లందు, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా గిరిజనులతో మమేకమై వారి సమస్యను తన సమస్యగా భావించి న్యాయపరంగా అందరిని న్యాయం చేశారని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వివిధ కేసుల సమస్యల కోసం రవి నాయక్ ను ఆశ్రయించి వారి కేసుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. రవి నాయక్ చిత్రపటానికి పూలమాల వేస్తూ సీనియర్ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు కంటతడి పెట్టుకున్నారు. తనకు కుడి భుజం లాగున్న రవి నాయక్ మృతి చెందడం చాలా బాధ వేసింది అని మనోవేదన చెందారు. రవి నాయక్ మృతి న్యాయవ్యవస్థకు తీరని లోటని గిరిజన కుటుంబంలో పెరిగి చిన్న వయసులోనే ఉన్నత స్థాయి ఎదిగిన న్యాయవాది లేని లోటు గిరిజనులకు తీరందని గిరిజన నాయకుడు అజ్మీర వీరన్న పేర్కొన్నారు. చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమకొండ రమేష్, ఆడప పుల్లారావు, దమ్మలపాటి ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త కాటేపల్లి నవీన్, చందు నాయక్, వాంకుడోత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.