Mahaa Daily Exclusive

  రాహుల్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం

Share

  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • విద్యార్థుల పోరాటం ఫలించింది
  • వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు అయూబ్

వరంగల్, బ్యూరో మహా ;

నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పోరాటం ఫలించిందని వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో, రోడ్లపై లక్షలాది విద్యార్థుల గొంతు వినిపించడంతో కేంద్రం తలొగ్గిందని, దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.

ఇది రాహుల్ గాంధీ ఒక్కరి విజయం కాదని దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థుల విజయం అని తెలిపారు. కేంద్రం మెడలు వంచి న్యాయం చేయించాం” అని అయూబ్ పేర్కొన్నారు.

లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.