Mahaa Daily Exclusive

  జననేతకు జన్మదిన వేడుకలు

Share

  • వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు
  • సర్పంచ్ టోనీ ఆధ్వర్యంలో రక్తదానం విజయవంతం

కారేపల్లి, మహా:

సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ మేదరి వీరప్రతాప్ టోనీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ జన్మదినం సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో శనివారం మెగా రక్తదానం ఏర్పాటు చేశారు.స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్త దానం చేశారు.అనంతరం మండల కేంద్రం కారేపల్లిలో డీజే పాటల నడుమ ర్యాలీ నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే తనయుడు యువజన నాయకులు మాలోత్ విగ్నేష్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ బానోత్ దేవుల నాయక్,సొసైటీ డైరెక్టర్లు అడ్డగొడ ఐలయ్య, డేగల ఉపేందర్,కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దబోయిన ఉమాశంకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్,హీరాలాల్,దండు ప్రవీణ్,యాకుబ్ అలీ,నాగులు,భీముడు,తాజుద్దీన్, షరీఫ్,స్థానిక నాయకులు పాల్గొన్నారు.