హైదరాబాద్, మహా
హీరో అల్లు అర్జున్ ప్రతి ఏడాది నిర్వహించే ఫ్యాన్స్ మీట్.. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు. అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రోల్స్ గురించి తమని విమర్శించే వారి గురించి స్పందించాడు. నచ్చలేదా వదిలేయ్ అని చెప్పుకొచ్చాడు. ‘టైమ్ అనుకోండి ఎనర్జీ అనుకోండి ఏమైనా అనుకోండి. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ప్రతిరోజు మనం 100 శాతం ఛార్జింగ్ అవుతాం. అదే రోజు ఆ ఛార్జింగ్ అంతా అయిపోతుంది. దీనిని నువ్వు ఏమైనా అనుకో. నువ్వు అది దేనికి వాడతావ్ అనేది నీ ఇష్టం. ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీ సమయం, ఎనర్జీని మీకు నచ్చిన పనిపైనే పెట్టండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం ఖర్చు పెట్టొద్దు. నచ్చలేదా వదిలేయ్. కనీసం నీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిల్చో. కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావు’ అని అల్లు అర్జున్ చెప్పాడు.








