- నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి.!
- ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి
- వచ్చేనెల 3తో ముగియనున్న గడువు
- 100% ఆన్‌లైన్ డిజిటైజేషన్ లక్ష్యంగా పనిచేయాలి
- ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో బిఎల్ఓలకు ఆదేశాలు: డిసి
ఇబ్రహీంపట్నం జులై 28 మహా:
ఆదిభట్ల సర్కిల్-15లో ఎస్ఐఆర్ ప్రత్యేక సమీక్ష సమావేశంలో 100% ఆన్‌లైన్ డిజిటైజేషన్ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ జోన్, ఆదిభట్ల సర్కిల్-15 పరిధిలోని రాగన్నగూడ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ…. ఎస్ఐఆర్ ఆన్లైన్ డిజిటలైజేషన్, పెండింగ్‌లో ఉన్న అన్ని ఎన్యుమరేషన్ పారాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని 100% పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఆదిభట్ల సర్కిల్-15లోని పురోగతి వివరాలు చూసుకుంటే ఎన్నిమరేషన్ పారాలను 100% ఓటర్లకు అందించిన డిజిటలైజేషన్ చేయడంలో 59 శాతమే జరిగిందని, మిగతా వాటిని నిర్ణీత గడువులోపు అత్యవసరంగా ఆన్లైన్ డిజిటలైజేషన్ పూర్తిచేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సకాలంలో నమోదు అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు బి.ఎన్.కే. రమేష్, ఎస్. శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, బిఎల్ఓ సూపర్వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.








