Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ పునరుద్ధరణకు సహకరిస్తా…

Share

  • జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ పునరుద్ధరణకు సహకరిస్తా
  • మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్
  • టీఎస్ జేయు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

మహబూబాబాద్, మహా ;

జర్నలిస్టుల పై దాడుల నివారణకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరణకు సహకరిస్తానని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ యూనియన్ జిల్లా నాయకులు కలసి జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ పునరుద్ధరించాలని వినతి పత్రాన్ని జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఐపీఎస్ కు అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ నీ పునరుద్ధరించడానికి కావలసిన విధి విధానాలను సమీక్షించి కమిటీ ఏర్పాటుకు సహకరిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగొని ఉదయ్ ధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి సతీష్ చారి, తదితరులు పాల్గోన్నారు.