Mahaa Daily Exclusive

  సుప్రీంను ఆశ్రయిస్తాం..- కేటీఆర్..

Share

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మొన్నటి వరకు స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు రీజనబుల్ పీరియడ్ అని చెప్పిందని తెలిపారు. రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు.