- మైసూర్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ సహ ఇన్చార్జిగా ప్రత్యేకంగా ఆహ్వానం.
మైసూరు, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైసూర్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ నాయకత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బీజేపీ జాతీయ సహ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన, ప్రధానమంత్రి మైసూర్ చేరుకున్న సందర్భంగా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ జాతీయ బాధ్యతల్లో చురుకుగా వ్యవహరిస్తున్న డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీగా కూడా ప్రజలకు సుపరిచితులు. దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ మైసూర్ పర్యటన సందర్భంగా స్వాగతం పలికిన నాయకుల్లో ఆయన కూడా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దక్షిణాదిలో పార్టీ విస్తరణకు జాతీయ నాయకత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్చార్జిగా డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డికి లభిస్తున్న ప్రాధాన్యం మరోసారి స్పష్టమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.







