- నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం
కారేపల్లి, మహ : కారేపల్లి సోసైటీ చుట్టు ప్రహారీ గోడ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. పహారి పనులను సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచ్ మేదరి వీర్రపతాఫ్(టోనీ)లు ప్రారంభించారు. ప్రహారి గోడ నిర్మాణానికి మొదటి విడుతగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నియోజవర్గ స్పెషల్ అభివృద్ధి నిధులు రూ. 5లక్షలు మంజూరు చేయటం జరిగింది. ఆ నిధులతో ప్రహారి నిర్మాణ పనులకు గ్రామపంచాయతీ తీర్మాణంతోపనులను చేపట్టారు. ఈసందర్బంగా చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సోసైటీ ద్వారా రైతులకు అన్ని రకాలు సేవలను అందిస్తున్నామని, ప్రభుత్వ పధకాలను అమలు చేయటం జరుగుతుందన్నారు. మరిన్ని సేవలు అందించటానికి సోసైటీకి అనుబంధంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.పీ.వో) ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.దానిలోరూ.2వేలు కట్టి సభ్యులుగా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సోసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు, ఉపసర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, వార్డు సభ్యురాలు అంకోలు విజయ, గ్రామపెద్దలు పెద్దమ్మ సత్యం,కేలోత్ రవి, పెండ్ర నాగేష్, శంకర్ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.








