*ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి సారించాలి*
*ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య*
*నాణ్యత, తూకం సక్రమంగా ఉండేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి*
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*
వరంగల్, బ్యూరో మహా;
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొని
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నిత్యావసర సరుకులు సక్రమంగా, నిర్ణీత సమయంలో అందేలా అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్) తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లాలో 13 మండలాల పరిధిలో 509 రేషన్ దుకాణాలు, 2,96,929 రేషన్ కార్డులు, 8,94,791 యూనిట్లు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు 16,906.392 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించినట్లు తెలిపారు. ఇటీవల 29,772 కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, వాటి పరిధిలో 93,825 యూనిట్లు ఉన్నట్లు వెల్లడించారు.
రేషన్ షాపుల్లో బియ్యం, ఇతర సరుకుల లభ్యత, నాణ్యత, తూకం సక్రమంగా ఉండేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. తక్కువ తూకం, సరుకుల అక్రమ తరలింపు వంటి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సరుకుల సరఫరా పై సమావేశంలో సమీక్షించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి,జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి,డీసీఎస్‌ఓ కిష్టయ్య, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ ఉమారాణిలు డీఆర్డీవో నాగ పద్మజ ,డి ఎం ఓ డీసీఎస్‌డీఓ, డీడబ్ల్యూఓ, డీఈఓ, డీటీడబ్ల్యూఓ, డీఎల్‌ఎంఓ, డీఎంసీఎస్ సంధ్యారాణి ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల ప్రతినిధులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







