భూపాలపల్లి, మహా ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి – మహాదేవపూర్ మధ్యలో శనివారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కాటారం నుంచి కాళేశ్వరం వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సడన్గా గారేపల్లి వైపు రివర్స్ తిరిగి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని సమాచారం.
Post Views: 19







