Mahaa Daily Exclusive

  హనుమకొండ లో ఘనంగా చాత్రోంకీ గూంజ్ కార్యక్రమం

Share

  • రాహుల్ గాంధీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల

హనుమకొండ, మహా;

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త విద్యార్థి యువజన సంవాద ఉద్యమం “ఛాత్రోం కీ గూంజ్ – విద్యార్థుల గర్జన” సభకు మద్దతుగా హనుమకొండ జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో.. హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రెటరీ గొట్టిముక్కుల సాగరిక రావు, హనుమకొండ అధ్యక్షులు కె.ఆర్. దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో విస్తృత స్థాయి అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ రోషిణి కుశల్ జైశ్వాల్ పాల్గొన్నారు.

  • ప్రత్యక్ష ప్రసారంలో రాహుల్ గాంధీ ప్రసంగం

కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. గత పదేళ్ల కాలంలో దేశంలో నీట్, యూజీసీ-నెట్ లతో పాటు దాదాపు 152 కి పైగా ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివే 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు ఈ పేపర్ లీకేజీల వల్ల రోడ్డున పడ్డాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందని అన్నారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న అన్యాయాలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు మాత్రమే నని, ప్రయాగ్‌రాజ్‌ వేదికగా ఆయన ఇచ్చిన ‘విద్యార్థుల గర్జన’ పిలుపు దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది. ‘జాబ్ నహీ మిలేగా తో సింహాసన్ హిలే’ అనే నినాదంతో దేశ యువతను రాహుల్ గాంధీ గారు ఏకం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను విపరీతంగా పెంచి పేదలకు విద్యను దూరం చేస్తున్న మోదీ సర్కార్‌పై విద్యార్థి లోకం తిరగబడాలి అని అన్నారు.

  • జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గురుకుల పాఠశాలలను, కళాశాలలను ఈరోజు తెలంగాణలోని మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వసతులతో బలోపేతం చేస్తోందని.. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. విద్యార్థుల చదువులకు, స్కాలర్‌షిప్‌లకు ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె.ఆర్. దిలీప్ రాజ్ మరియు సాగరిక రావు మరియు బృందాన్ని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని ప్రతి కాలేజీ, హాస్టల్, మరియు విద్యాసంస్థను సందర్శించి, కేంద్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడతామని, రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరుస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సబ్యులు, మండల, డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్ రెడ్డి, రుగ్వేద్ రెడ్డి, స్టేట్ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ గోవిందు శ్వేత, అల్వాల కార్తీక్, అశ్విన్ రథోడ్ తదితరులు పాల్గొన్నారు.