Mahaa Daily Exclusive

  కారేపల్లి క్రాస్ రోడ్ లో ఘనంగా బోనాల వేడుక…

Share

కారేపల్లి, మహ:సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కుటుంబ సమేతంగా కొత్త కుండల్లో బోనాలు తయారు చేసి సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల కుండలను ఇంటి వద్ద నుండి తలపై ఎత్తుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎర్రమ్మ ఆలయానికు వెళ్లారు.కారేపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ,ఎర్రమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ పెద్దలు సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త నాగేశ్వరరావు, పుచ్చకాయల శ్రీనివాసరావు, మొగిలిచర్ల మల్లికార్జున్, అనంతారపు వెంకటాచారి, ఏపూరి లక్ష్మీనారాయణ, పగడాల నాగేశ్వరరావు, వెగ్గలం పుల్లాచారి,సూరపరెడ్డి ఇంద్రారెడ్డి,పురం గోవర్ధన్, రాకేష్,కంసాని నాగరాజు, కోలా ఉపేందర్,మల్లెంపాటి శ్రీనివాసరావు,బట్టు మోహన్,బట్టు శ్రీను స్థానిక ప్రజలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.