Mahaa Daily Exclusive

  పిజిఎస్ఏఐ జిల్లా అధ్యక్షుడిగా బిల్లా శ్రీకాంత్..

Share

వరంగల్, మహా;

ప్రియాంకా గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా (పిజిఎస్ఏఐ) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని 37వ డివిజన్ ఖిలా వరంగల్ తూర్పు కోటకు చెందిన సీనియర్ నాయకులు బిల్లా శ్రీకాంత్ నియామకమైనట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రియాంకా గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుముల్ల యమునా రెడ్డి ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో పిజిఎస్ఏఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో మరింత బాధ్యత పెరిగిందని, శక్తివంచన లేకుండా వరంగల్ జిల్లాలో ప్రియాంకా గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రియాంకా గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుముల్ల యమునా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందెల్లి ప్రకాష్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పోలీస్ వెంకన్న, పిజిఎస్ఏఐ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మేదరబోయిన రమేష్, రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Latest