- తెలంగాణ గడ్డపై పోరాట స్ఫూర్తిని చూపిన వీరుడిగా పేర్కొన్న ఎమ్మెల్యే…
ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 మహా:
ఆత్మగౌరవం కోసం మొఘల్ పాలకులకు ఎదురొడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ను నేటితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని ఆ వీరుడి పోరాటం, త్యాగాలను గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే.. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ఉన్న సర్దార్ పాపన్న విగ్రహానికి ఘననివాళి అర్పించారు. చెరువుకట్టపై గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడి ఆశయాలకనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణ గడ్డపై జన్మించిన పాపన్న గౌడ్ చరిత్రను, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ధర్మబిక్షం యొక్క సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. చెరువుకట్టపై ఆయన విగ్రహ ఏర్పాటుకు స్థానిక నేతలు కోరడంతో, దానికి తన వంతు సాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి భూపతిగళ్ల మహిపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, గౌడ సంఘం పెద్దలు ఈసి శేఖర్ గౌడ్ మామ, తాళ్ల మహేష్ గౌడ్, తాళ్ల శ్రీశైలం గౌడ్, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, చనమోని రమేష్, కొత్త ప్రవీణ్ గౌడ్, నీళ్ల భాను గౌడ్, పల్లె రజనీకాంత్ గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.








