అబ్దుల్లాపూర్ మెట్టు ఆగస్టు 18 మహా:
గెరిల్లా పోరాటంతో దళిత, బహుజనుల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషిచేసిన గొప్ప యుద్ధ వీరుడు.. నిరంకుశత్వంపై మండిన నిప్పుకణిక.. “సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి” సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్మెట్ మండలం, అనాజ్ పూర్ గ్రామంలో, గౌడ సంఘం అధ్యక్షులు తాటిపల్లి విష్ణుగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 19








