Mahaa Daily Exclusive

  రెండు కొత్త ఎయిర్ పోర్టులు.. ఫలించిన సీఎం రేవంత్ ప్రయత్నం..

Share

  • వరంగల్‌, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు
  • కొత్తగూడెంకు త్వరలోనే సాంకేతిక బృందాన్ని పంపిస్తాం
  • పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు

 

న్యూఢిల్లీ, మహా : వరంగల్‌, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌ మాట్లాడుతూ తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా మరో రెండింటిని ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ విమానాశ్రయ.ంపై ఉన్న ప్రయాణికుల తాకిడి తగ్గనుందని పేర్కొన్నారు. వరంగల్‌లో కచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ విషయంలో గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విమానాశ్ర. నిర్మాణం కోసం కావాల్సిన భూసేకరణకు సంహబంధించి నిధులను కూడా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుక్వం భూ సేకఱణ ప్రక్రి.ను వేగవంతం చేసేందుకు మార్గం సుగమం చేసింది. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం తనతో చెప్పారన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరలోనే అక్కడికి సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు. పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలున్నాయని అన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల విషయంలో దీర్ఘకాలంగా సాచివేత దోరణిని గత పాలకులు అవలంభించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి చ్చిన తర్వాత విమానాశ్ర.ాల ఆవశ్యకతను గ్రహించి వీలైనంత తొందరగా కొత్త విమానాశ్రయాల నిర్మాణం కోసం కావాల్సిన చర్య.లను యుద్ద ప్రాతిపదికన చేపట్టడంతో పాటు సాంకేతిక అంశాలను అధ్యయనం చేయించడం, స్థల సేకరణ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అంతేకాకుండా విమానాశ్రయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్.లపై ఎప్పటికప్పుడు పౌర విమానయాన శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఫలితంగా కేంద్రం కూడా విమానాశ్రయాల నిర్మాణం కోసం సానుకూలంగా స్పందిస్తోంది.