Mahaa Daily Exclusive

  గ్రామీణ వైద్యులపై టీజీఎంసి దాడులను ఆపాలి

Share

  • ఆర్ఎంపీలను బదనాం చేయాలనుకోవడం బాధాకరం
  •  ఆర్ఎంపీలు పరిదికి మించి వైద్యం చేయొద్దు
  • గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు

కారేపల్లి, మహ:మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ప్రథ‌మ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌(టీజీఎంసీ) దాడులు చేయడం తక్షణమే ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) అనుచిత దాడులతో గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో వైస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు పారామెడికల్‌ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి అర్హత సాధించిన ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడికి ధృవీకరణ సర్టిఫికెట్లు అందించాలని దాదాపు 20 వేల మందికి వెయ్యి గంటల శిక్షణ ఇచ్చిందని,మిగతా వారికి మధ్యలోనే శిక్షణ ఆగిపోయిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 65వేల మంది ధరఖాస్తులు చేసుకున్నారని వారిలో 55 వేల మందిని అర్హులుగా తేల్చారన్నారు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో దానికి నిధులు కేటాయింపు లేక ఆపక్రియ నిలిచిపోయిందన్నారు.నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పక్రియను కొనసాగిస్తుందని ఆశించామన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుకు ఆర్ఎంపీలు గ్రామీణ ప్రాంతాలలో కీలక పాత్ర పోషించారని గుర్తుకు చేశారు.గడిచిన మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు టీజీఎంసీ గ్రామీణ వైద్యులపై దాడి చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవటం విచారకరమన్నారు. గ్రామీణ వైద్యులను గ్రామీణులే రక్షించుకుంటారన్నారని ధీమా వ్యక్తం చేశారు.గ్రామీణ వైద్యులు బతుకుదెరువు కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్ధితిని టీజీఎంసీ తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పంధించి గ్రామీణ వైద్యుల సేవలకు చట్టబద్దత తీసుకురావాలని కోరారు.

ఆర్ఎంపీలు పరిధి నుంచి వైద్యం చేయద్దు

ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని పరిధికి మించి వైద్యం చేసి ఇబ్బందులలో పడద్దని సూచించారు.ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి,ఉపాధ్యక్షుడు నారపోగు సుదర్శన్,జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసరి శ్రీనివాసరావు,దుస్సా మనోహర్,సింగరేణి మండల అధ్యక్ష,కార్యదర్శులు మండెపూడి వీరయ్య చౌదరి,కార్యదర్శి ఆకారపు రఘు,ఐ.వెంకటేశ్వర్లు,

సున్నం రామారావు,బ్రహ్మం,

సైదులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest