వరంగల్, బ్యూరో మహా;
రేపు అనగా ఆగస్టు 28న రక్షాబంధన్, పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదే! శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజు రక్షాబంధన్ పండుగ కూడా జరగనుండటంతో రాఖీ కట్టే విషయంలో చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం కారణంగా సూతకం ఉంటుందా? రాఖీ వేడుకలను వాయిదా వేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించకపోవడంతో ఆందోళన అవసరం లేదని విశ్లేషకులు చెప్పుకొచ్చారు.








