హైదరాబాద్, మహా : నేపాల్‌లో సంభవించిన వరదల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్‌బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుహాసిని ఈ నెల 19న హైదరాబాద్‌కు చేరుకున్నారు అనంతరం మానససరోవర్ యాత్ర కోసం నేపాల్‌కు బయలుదేరినట్లు సమాచారం
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన స్నేహితురాలితో కలిసి ఖాట్మండ్‌లో చేరిన సుహాసిని.. టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయలుదేరినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆ తర్వాత వరదల సమాచారం తెలియడంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో సుహాసిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








