Mahaa Daily Exclusive

  జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి..! సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ కు ఎల్.ఓ.సీ అందజేసిన అయూబ్..

Share

  • జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
  • వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్
  • సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ కు ఎల్.ఓ.సీ అందజేసిన అయూబ్

వరంగల్, బ్యూరో మహా ;

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో, ఆయన హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనం భాస్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ వెంటనే స్పందించి, ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంతేకాకుండా శనివారం ఆయన ఎల్.ఓ.సీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఉచితంగా వైద్యం అందే విధంగా అవసరమైన చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులతో సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పనిచేసే జర్నలిస్టులు తప్పని సరిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సమాజాన్ని ప్రభావితం చేసే మీరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
వనం భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఆయనకు అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని మహమ్మద్ అయూబ్ తెలిపారు.

Latest