- ఇంజాపూర్లో తీజ్ వేడుకల్లో పాల్గొన్న మల్రెడ్డి రంగారెడ్డి..
- మొలకల బుట్టను నెత్తినబెట్టుకుని మహిళలతో కలిసి సందడి…
- నేటితరం యువత వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే..
ఇబ్రహీంపట్నం ఆగస్టు 30 మహా:
బంజారాల సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు తీజ్ పండుగ నిలువెత్తు నిదర్శనమని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నిర్వహించిన తీజ్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయనకు… సాంప్రదాయ దుస్తులు ధరించిన బంజారా మహిళలు, యువతులు ఘనస్వాగతం పలికారు. గిరిజన సోదరీమణుల కోరిక మేరకు మల్రెడ్డి రంగారెడ్డి కూడా బంజారా సంస్కృతిని గౌరవిస్తూ, గోధుమ మొలకలు ఉన్న వెదురు బుట్టను తన నెత్తిన పెట్టుకుని, సందడి చేశారు. బంజారా సాంప్రదాయ డప్పు చప్పుళ్లు, తీజ్ పాటల మధ్య మహిళలతో కలిసి ఆయన అడుగులు వేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, నేటితరం యువత వాటిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇంజాపూర్లో బంజారాల కోసం నిర్మించతలపెట్టిన భావన నిర్మాణానికి తన సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, బంజారా మహిళలు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.








