Mahaa Daily Exclusive

  ముత్యాలమ్మ తల్లికి ఘనంగా మొక్కులు..! సాయి విహార్ అపార్ట్మెంట్‌లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక వేడుకలు..

Share

కారేపల్లి, మహా: సాయి విహార్ అపార్ట్మెంట్‌లో ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునే వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు భూక్యా భాషా నాయక్ గౌరవాధ్యక్షులు మండేపూడి వెంకటయ్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కులు చెల్లించుకునే సందర్భంగా అమ్మవారికి చీరె, కోడి,మేకపోతు కొబ్బరికాయలు తదితర పూజా సామగ్రిని సమకూర్చారు. అమ్మవారి ఆశీస్సులతో అపార్ట్మెంట్‌లోని కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు భూక్యా భాషా నాయక్ ఆకాంక్షించారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని తల్లిని కోరుతూ మొక్కులు చెల్లించినట్లు తెలిపారు.
వేడుకల్లో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.