Mahaa Daily Exclusive

  ఆదివాసి బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి తుడుందెబ్బ..

Share

కారేపల్లి, మహ: కష్టపడి చదువుకొని, కుటుంబానికి అండగా నిలవాలనే ఆశయంతో ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన ఒక ఆదివాసి ఆడబిడ్డ ఊకె శిరీష జీవితం అర్ధాంతరంగా ముగియడం అత్యంత బాధాకరమని ఆదివాసి హక్కుల పోరాట సమితి( తుడుందెబ్బ) రాష్ట్ర కోశాధికారి కల్తి రాంప్రసాద్ జిల్లా అధ్యక్షులు బచ్చల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతికి సంబంధించిన పూర్తి నిజాలను బయటపెట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఊకె అనుమానాస్పద మృతి ఆదివాసి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎవరి ప్రభావానికీ లోనుకాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలనువెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు.