Mahaa Daily Exclusive

  మహా పత్రిక రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్న గుండేటి నరేంద్ర కుమార్..! నరేందర్ కు అవార్డు చిత్రపటాన్ని అందజేసిన మహా పత్రిక ప్రతినిధి ఈద శ్రీనాథ్

Share

  • నరేందర్ కు అవార్డు చిత్రపటాన్ని అందజేసిన మహా పత్రిక ప్రతినిధి ఈద శ్రీనాథ్

వరంగల్, మహా ;

ఇటీవల హైదరాబాదులో ఓ ప్రవేట్ హాల్లో జరిగిన మహా తెలుగు దినపత్రిక ఏఎన్ఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అవార్డుల పురస్కారం విజయవంతం ఆయన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 20 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ కు ఉత్తమ లీడర్ గా రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈ అవార్డును మహా తెలుగు దినపత్రిక చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, సీఈవో పంది రామచంద్రా రెడ్డి, స్టేట్ బ్యూరో గడ్డం కృష్ణమూర్తి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఈవో ఆదేశాల మేరకు అవార్డు యొక్క చిత్రపటాన్ని రూపొందించిన గ్రేటర్ వరంగల్ మహా తెలుగు దినపత్రిక ప్రతినిధి ఈద శ్రీనాథ్ మంగళవారం మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొరివి పరమేశ్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.