ఐదేళ్ల ప్రేమబంధం.. నెల రోజులకే విషాదాంతం!
* భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక రైలు కిందపడి భర్త మృతి.
ఎర్రుపాలెం, మహా
ఐదేళ్లుగా ప్రేమించుకుని, నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్న మహేశ్, వెంకటరమణ దంపతుల జీవితం విషాదాంతమైంది. వివాహానంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్య వెంకటరమణ ఆత్మహత్య చేసుకోగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త మహేశ్ కూడా ఎర్రుపాలెం రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి మృతి చెందాడు.మహేశ్, వెంకటరమణ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్దికాలానికే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటరమణ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద వెంకటరమణ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య మరణవార్తతో మహేశ్ తీవ్ర మనోవేదనకు గురైనాడు.
భార్య మరణాన్ని తట్టుకోలేక మహేశ్ ఎర్రుపాలెం రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల ప్రేమ బంధంతో ఒక్కటైన జంట కొద్దికాలానికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.








