Mahaa Daily Exclusive

  ఎల్బీనగర్ – హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్..

Share

  • ఎల్బీనగర్ – హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార
  • 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
  • రాష్ట్రంలోని పలు కీలక రహదారులు, ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
  • వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

న్యూఢిల్లీ, మహా : ఎల్బీనగర్ – హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలక రహదారులు, ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి పలు ప్రాజెక్టులపై చర్చించారు. కృష్ణా నదిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు విజ్ఞప్తిపై స్పందించిన నితిన్ గడ్కరీ.. కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ భేటీలో తెలంగాణ రహదారుల రంగానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్వతమాల పథకం ద్వారా తెలంగాణలో 5 రోప్‌వేల ఏర్పాటుకు, సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్‌వోబీల నిర్మాణానికి కేంద్రమంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని 34 పనులకు సీఆర్‌ఐఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరగా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. వీటితో పాటు పుల్లూరు – అలంపూర్ – జట్రపోలు – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల – అచ్చంపేట – డిండి – దేవరకొండ – మల్లేపల్లి – నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో నవంబర్ 19 నుండి 22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలకు కేంద్రమంత్రిని ఆహ్వానించగా, అందుకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతానని తెలిపారు.

 

నితిన్ గడ్కరీ, కోమటి రెడ్డి ప్రత్యేక భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఎల్బీనగర్ – హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన నితిన్ గడ్కరీ. హైదరాబాద్ – శ్రీశైలం NH 765పై ఎలివేటెడ్ కారిడార్ కి విజ్ఞప్తిపై కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పర్వతమాల పథకం ద్వారా తెలంగాణకు 5 రోప్ వే లకు కేంద్రమంత్రి గడ్కరీ ఆమోదించారు. హైద్రాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పై సానుకూలంగ స్పందించిన కేంద్ర మంత్రి. సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్ఓబి లకు ఆమోదం లభించింది. తెలంగాణ లో 34 పనులకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని మంత్రి కోరగా కేంద్ర అధికారులను ఆదేశాలు ఇచ్చారు. పుల్లూరు – అలంపూర్ – జట్రపోలు – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల – అచ్చంపేట – డిండి – దేవరకొండ – మల్లేపల్లి – నల్గొండ రాష్ట్ర హైవే లను జాతీయ హై వే లుగా మార్చాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి. హైదరాబాద్ లో నవంబర్ 19-22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కు మంత్రి ఆహ్వానించగా.. వస్తానని చెప్పిన కేంద్ర మంత్రి గడ్కరీ.

Latest