Mahaa Daily Exclusive

  విజయదశమి నాడు కొత్త పార్టీ ప్రకటన….

Share

విజయదశమి నాడు కొత్త పార్టీ ప్రకటన.

* నాది బాల్‌ ఠాక్రే పాత్ర: విజయసాయిరెడ్డి.

హైదరాబాద్, మహా .

నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రానున్న విజయదశమి పర్వదినం నాడు కొత్త పార్టీ వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం నవరాత్రి పవిత్ర దినాల్లో తన పార్టీ పేరు, జెండా, విధివిధానాలు (అజెండా) సిద్ధమవుతున్నాయని, దసరా నాటికి వీటన్నింటినీ ప్రజల ముందుకు తెస్తానని పేర్కొన్నారు.

తాను నూతన పార్టీ పెడుతున్నాననే ప్రకటనతో కొందరు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని, అలాంటి వారి చౌకబారు ప్రచారాలకు తాను ఎలాంటి విలువా ఇవ్వబోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాతుకుపోయిన రెండు కుటుంబ పార్టీలపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీలో యువతకే పెద్దపీట వేస్తామని ఉద్ఘాటిస్తూ.. “తన పార్టీలో అధికారం జెన్‌–జీ (యువతరం)ది, నాది బాల్‌ ఠాక్రే పాత్ర” అని ఆయన మరోసారి తేల్చిచెప్పారు.

Latest