వరంగల్, కలెక్టరేట్ మహా;
వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.








