- బతుకమ్మ వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చే అతిపెద్ద పండుగ బతుకమ్మ
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్,
వరంగల్‌లోని రంగళీల మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ఆడి పాడి సందడి చేశారు.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో లభించే తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను కన్నుల పండుగగా జరుపుకుంటామని, ముఖ్యంగా ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అతి పెద్ద పండుగ బతుకమ్మ అని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ దసరా ఉత్సవాల లో భాగంగా ఐకేపీ, మెక్మా ,టూరిజం స్టాల్స్ ఏర్పాటు తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో మెడికల్ క్యాంప్ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లలు తప్పిపోకుండా వారి తల్లి దండ్రుల పేర్లు పోన్ నెంబర్లు రాసి పిల్లల చేతికి బ్యాడెజ్ వేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది.
బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి.
ఈ బతుకమ్మ సంబరాలలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, డియార్వో విజయలక్ష్మి, ఆర్డీవో సుమ,జడ్పీ సీఈవో వసంత, ఎమ్మార్వో ఇక్బాల్, సంబంధిత శాఖ అదికారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








