- చెట్టును ఢీకొన్న ఆర్15 బైక్.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి.
- జార్ఖండ్‌కు చెందిన కాస్మోస్, సుమిత్ దుర్మరణం
శామీర్‌పేట, మహా.
హైదరాబాద్ శివారులోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న యమహా ఆర్15 బైక్ అలియాబాద్ వద్ద చెట్టును ఢీకొట్టడంతో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను కాస్మోస్ మార్కి (22), సుమిత్ కుళ్లు (23)గా పోలీసులు గుర్తించారు. కాస్మోస్ అలియాబాద్‌లో నివాసం ఉంటుండగా, సుమిత్ బాలానగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరూ అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని డైనమిక్ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ నిర్వహించిన విందుకు హాజరై, ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అలియాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి గ్రామం వైపు వెళ్తున్న సమయంలో బ్రిందా రెడ్డి కన్వెన్షన్ సమీపంలో బైక్ చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జీనోమ్ వ్యాలీ పోలీసు ఇన్స్పెక్టర్ గురువయ్య గౌడ్ తెలిపారు.








