- శ్రమదానం చేసిన ఇందిరమ్మ డైరెక్టర్లు
కారేపల్లి, మహ : కారేపల్లి మండలం మాదారం పెద్ద చెరువు లో వ్యర్ధాలను తొలగించే కార్యక్రమాన్ని సోమవారం సర్పంచ్ అజ్మీర ఉమానరేష్ చేపట్టారు. మాదారం పెద్ద చెరువులో బతుకమ్మ లను నిమజ్జనం, గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా చెరువులో పూలు, ఆకులు, కొమ్మలకు నిలయంగా మారాయి. ఈ వ్యర్ధాలు కుళ్ళి విషం గా అవకాశం ఉందని, గ్రామస్థులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఉమానరేష్ చెరువులో వ్యర్థాలను తొలగించే పనిని చేపట్టారు. గ్రామపంచాయతి సిబ్బంది చెరువులోని వ్యర్ధాలను తొలగించి ట్రాక్టరు ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. ఇందిరమ్మ డైరెక్టర్లు అజ్మీర్ నరేష్, బట్టు నరసయ్య, రమేష్, వెంకన్న, పద్మ లు చెరువు శుభ్రపరిచే పనులలో జీపీ వర్కర్స్ తో కలిసి శ్రమదానం చేసి గ్రామస్తుల ప్రసంశలు అందుకున్నారు.








