Mahaa Daily Exclusive

  శ్రీశైల మల్లన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ.

Share

శ్రీశైలం, మహా:

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా శ్రీశైలం చేరుకున్న మంత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీశైలం ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.

దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భక్తుల సందడి నెలకొంది.