- హసన్ పర్తిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు
- ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ సయ్యద్ మసూద్
హసన్‌పర్తి,మహా :
పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోర్టల్ లో తమ ఓటును నమోదు చేసుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ సయ్యద్ మసూద్ పిలుపునిచ్చారు.
వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో హసన్ పర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లను కలిసి ఓటరు నమోదు ప్రక్రియను నిర్వహించారు.
ఈ సందర్భంగా సయ్యద్ మసూద్ మాట్లాడుతూ… ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని, విద్యావంతుల గొంతుకను శాసన మండలిలో వినిపించే అవకాశం ఈ ఎన్నికల ద్వారానే వస్తుందని అన్నారు.
ఓటు నమోదు ఎలా?
డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ అర్హులు
https://ceotelangana.nic.in అధికారిక పోర్టల్ లో ఫారం-18 ద్వారా నమోదు చేసుకోవాలి
డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఫోటో, నివాస ధృవీకరణ పత్రాలు అవసరం అని పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమ బీఆర్ఎస్ టీం సహాయం చేస్తుందని సయ్యద్ మసూద్ తెలిపారు. గత ఎన్నికల్లో చాలా మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోకపోవడంతో ఓటు హక్కు కోల్పోయారని, ఈసారి అలా జరగకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్లను కలిసి, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.








