Mahaa Daily Exclusive

  మురాసు తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share

  • భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి
  • 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సేవలు – టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424

వరంగల్, కలెక్టరేట్ మహా :

జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

సోమవారం జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద ప్రజలు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు సంబంధిత శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

24 గంటలు కంట్రోల్ రూమ్ సేవలు

ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

వర్షాలు, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కోరారు.