- హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్!
- తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపోరాటం
అమరావతి, మహా : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలతో జగన్‌పై కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్‌పై తదుపరి పరిణామాలు తెలియాల్సి ఉంది.








