Mahaa Daily Exclusive

  పేరెంట్స్ కు ఏపీ ప్రభుత్వం కీలక సందేశం…!!

Share

ఏపీ ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ – టీచర్ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం .. ఏయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు బాపట్లలో.. డిప్యూటీ సీఎం పవన్ కడపలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో పేరెంట్స్ ను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసారు.

స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో ప్రారంభించనున్నారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా అన్ని విభాగాల్లోనూ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు – విద్యా ప్రమా ణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్​లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి నిర్వహించే ఈ సమావేశం కోసం పేరెంట్స్ కు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశం ద్వారా ఇక నుంచి వారి భాగస్వామ్యం తోనే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేయనున్నారు