Mahaa Daily Exclusive

  నల్లగొండలో దారుణం….

Share

  • నల్లగొండలో దారుణం
  • పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య
  • భార్యాభర్తల మధ్య వివాదంతో బండకేసి కొట్టిన భర్త
  • తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
  • నిందితుడిని అదుపులోకి తీసు కున్న పోలీసులు

నల్లగొండ, మహా : జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మహిళా హోంగార్డు భర్త చేతిలో హత్యకు గురైంది. కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీ యడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.నల్లగొండ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలీ స్ క్వార్టర్స్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. హెడ్‌ క్వార్టర్స్‌ లో హోంగార్డుగా విధులు నిర్వ హిస్తున్న మహబూబ్ బీ (43)ను ఆమె భర్త సతీష్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సతీష్, భార్య మహబూబ్ బీ తలను బండకేసి బలంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్ బీకి సుమారు 15 ఏళ్ల క్రితం గతంలో హోంగార్డుగా పనిచేసిన సతీష్‌తో వివాహమైంది. అయితే కొన్నేళ్ల క్రితం సతీష్ విధుల నుంచి తొలగింపునకు గురయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యతలను మహబూబ్ బీనే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు

సమాచారం అందుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూరల్ ఎస్సై శివప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై నాంపల్లి వెంకట్ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. నిందితుడు సతీష్‌ ను అదు పులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ శివ రామిరెడ్డి వెల్లడించారు.