Mahaa Daily Exclusive

  వరంగల్ లో బిర్యాని హోటల్స్ పై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ దాడులు..

Share

  • వరంగల్ లో బిర్యాని హోటల్స్ పై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ దాడులు
  • ఐదు బిర్యాని హోటళ్లలో అధికారుల ముమ్మర తనిఖీలు
  • సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌, ఫ్రోజెన్‌ చికెన్‌ గుర్తింపు, స్వాధీనం
  • వంట తయారీ గదుల్లో అపరిశుభ్రత, బొద్దింకలు, సాలెగూళ్లు
  • లైసెన్సులు, వైద్య ధ్రువపత్రాలు లేకుండానే నిర్వహణ
  • దాడుల్లో రూ.23,468 విలువైన పదార్థాలు స్వాధీనం

వరంగల్, బ్యూరో మహా ;

వరంగల్ బిర్యానీ ప్రియులారా జర జాగ్రత్త! మీరు ఇష్టంగా తింటున్న బిర్యానీలో ఏం కలుపుతున్నారో తెలుసా? వరంగల్ మండి బజార్ లోని ఫేమస్ ఖుర్షీద్ తో పాటు జాఫ్రాన్, గ్రీన్ పార్క్ కోహినూర్, తయూబ్ మొత్తం ఐదు బిర్యానీ హోటళ్ల లో టాస్క్ ఫోర్స్, ఆహార భద్రతా అధికారులు మెరుపు దాడులు నిర్వహించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింథటిక్ ఫుడ్ కలర్స్, ఫ్రోజెన్ చికెన్, సగం ఉడికిన చికెన్, బొద్దింకలు, సాలెగూళ్లతో అపరిశుభ్రమైన వాతావరణంలో బిర్యానీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు, ఆహార భద్రతా విభాగం అధికారులు కలిసి మండి బజార్ లోని ఉన్న బిర్యానీ హోటల్స్ పై ఆకస్మిక దాడులు చేశారు.

*స్వాధీనం చేసుకున్న కల్తీ, అపరిశుభ్ర ఆహార పదార్థాలు*

సింథటిక్ ఫుడ్ కలర్స్ (కృత్రిమ రంగులు)
ఫ్రోజెన్ చికెన్ (నిల్వ ఉంచిన చికెన్), సగం ఉడికించిన చికెన్
మూతపెట్టని ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

*అధికారులు గుర్తించిన 12 ఉల్లంఘనలు – దిమ్మతిరిగే నిజాలు*

ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ లైసెన్స్ ప్రదర్శించబడే లేదని అసలు లైసెన్స్ ఉందా లేదా?
ఆహార పదార్థాలు మూతపెట్టకుండా బహిరంగంగా ఉంచారు.
ప్రమాదకరమైన కృత్రిమ ఆహార రంగులు కనుగొనబడ్డాయి – ఇవి క్యాన్సర్ కారకాలు.
గడ్డకట్టిన చికెన్ కనుగొనబడింది, ఎన్ని రోజులదో తెలియదు.
ఆవరణలో సాలెగూళ్లు గమనించబడ్డాయి.
సగం ఉడికించిన చికెన్ కనుగొనబడింది – కస్టమర్లకు అదే వడ్డిస్తున్నారా?
ఆవరణ లోపల బొద్దింకలు కనుగొనబడ్డాయి
నేలను సరిగ్గా శుభ్రం చేయలేదు, జిడ్డు,మురికితో అధ్వాన్నం, గోడలు చాలా అధ్వాన్నంగా, అపరిశుభ్రంగా ఉన్నాయని అంతేకాకుండా
ఆహార పదార్థాలను నిర్వహించేవారికి వైద్య ధృవీకరణ పత్రాలు కూడా లేవని వారికి ఏ రోగాలు ఉన్నాయో? ముఖ్యంగా
కీటక నియంత్రణ సర్టిఫికెట్ లేదు
నీటి విశ్లేషణ నివేదికలు లేవు ఏ నీటితో వండుతున్నారో? అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యంగా
జాఫ్రాన్‌ బిర్యానీ హోటల్‌, కుర్షీద్‌ బిర్యానీ హోటల్‌, గ్రీన్‌ పార్క్‌ హోటళ్లలో తనిఖీ చేయగా అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. మూడు హోటళ్లలోనూ నేలలు, గోడలు శుభ్రంగా లేకపోవడం, ఆహార పదార్థాలను కప్పకుండా నిల్వ చేయడం గుర్తించారు. సింథటిక్‌ ఫుడ్‌ కలర్లు, ఫ్రోజెన్‌ చికెన్‌, సగం ఉడికించిన చికెన్‌ లభించాయి. వంట గదుల్లో బొద్దింకలు, పరిసరాల్లో సాలెగూళ్లు కనిపించాయి. గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో రూ.23,468 విలువైన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ 16 ప్యాకెట్లు (రూ.1,248), టేస్టింగ్‌ సాల్ట్‌ 48 ప్యాకెట్లు (రూ.7,920), ఫ్రోజెన్‌ చికెన్‌ 20 కిలోలు (రూ.6,000), చికెన్‌ కబాబ్‌ 10 కిలోలు (రూ.3,000), పనీర్‌ 5 కిలోలు (రూ.5,000), జింజర్‌ పేస్ట్‌ కిలో (రూ.300) ఉన్నాయి.

ఆహార భద్రతా చట్టం ప్రకారం జాఫ్రాన్‌ యజమాని మహ్మద్‌ ఖిల్లాద్‌ బేగ్‌, ఖుర్షీద్‌ యజమాని కుర్షీద్‌, గ్రీన్‌ పార్క్‌ యజమాని మహ్మద్‌ అబ్దుల్‌ వాసిఫ్‌ లపై చర్యలు తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సూచించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్లు జి. సుబ్బారెడ్డి, కె. శ్రీధర్‌, బి. రాజగోపాల్‌, బండారి రాజు, తదితరులుఎస్‌ఐలు బి. ఉప్పలయ్య, కె. సుధాకర్‌, సాంబయ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు మౌనిక, తదితరులు పాల్గొన్నారు.