సీనియర్ జర్నలిస్ట్ వెంకటరమణ కు
హెచ్ యు జే , టీడబ్ల్యూజేఎఫ్ నివాళి
హైద్రాబాద్,నవంబర్ 23
గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందిన
హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వనం వెంకటరమణ కు
TWJF, HUJ సంఘాలు నివాళులర్పించాయి. సోమవారం అంబర్ పేటలోని వెంకటరమణ నివాసంలో బౌతికదేహానికి
నాయకులు
పూలమాల వేసి అంజలి ఘటించారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, బీసీ సంఘంతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు వెంకటరమణ కు నివాళులర్పించారు.
సీనియర్ రిపోర్టర్‌గా వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన వెంకట రమణ ఎప్పుడూ చిరునవ్వుతో సహచరులను, పరిచయస్తులను ఆప్యాయంగా పలకరిస్తుండేవారని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఓ వివాహ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం వరకూ అందరితో కలివిడిగా ఉన్న వెంకటరమణ.. ఆకస్మిక మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన గతంలో ప్రజాశక్తి, నవతెలంగాణలో రిపోర్టర్ గా సబ్ ఎడిటర్ గా పనిచేశారు. V6 వెలుగు దినపత్రికతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ లో రిపోర్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు ప్రభ రిపోర్టర్ గా కొనసాగుతున్నారు.
నివాళులర్పించిన వారిలో, ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, జనరల్ సెక్రటరీ బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు మాణిక్ ప్రభు, గుడిగ రఘు,బట్టిపాటి రాజశేఖర్,హెచ్ యు జే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, సీనియర్ నాయకులు వంగాల రమేష్, యాదయ్య, ప్రశాంత్ తదితరులున్నారు.
సోమవారం మధ్యాహ్నం అంబర్ పేట స్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.








