ఖిలా వరంగల్, మహా ;
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కిలా వరంగల్ తూర్పు కోట వాస్తవీడు అచ్చ విద్యాసాగర్ అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది . అధైర్యపడవద్దని కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సంఘరబోయిన విజయ్ నాయకులు బిల్ల రవి సంగరబోయిన ఉమేష్, శిరబోయిన వాసు బేర వేణు మంద శ్రీధర్ రెడ్డి, గన్నారం ప్రభాకర్ ల తోపాటు అచ్చ విద్యాసాగర్ అన్న వీరేష్ బాబు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








