Mahaa Daily Exclusive

  ఏసీబీలో అవినీతికి తావులేదు…

Share

ఏసీబీలో అవినీతికి తావులేదు.
* అధికారిపై వచ్చిన ఫిర్యాదుపైనా నిష్పక్షపాత విచారణ.
* తెలంగాణ ఏసీబీ స్పష్టీకరణ

హైదరాబాద్, మహా:

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో అవినీతికి ఏమాత్రం తావులేదని, చట్టానికి ఎవరూ అతీతులు కారని తెలంగాణ ఏసీబీ స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ చేసిన ఆరోపణలపై స్పందించింది. ఏసీబీ అధికారిపై వచ్చిన ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారిస్తామని ప్రకటించింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు అధికారిపై మాజీ ఏడీఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఇప్పటికే ఫిర్యాదుదారుడిని మూడుసార్లు విచారణకు పిలిచినట్లు ఏసీబీ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొంది.

ఏసీబీ అధికారిపై చేసిన ఆరోపణలు విచారణలో నిరూపితమైతే, సంబంధిత అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సొంత శాఖకు చెందిన అధికారులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపింది. అవినీతి ఆరోపణల విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఏసీబీ వెల్లడించింది.