- దిబ్బగూడెంలో బీఆర్ఎస్కు బలం.. 30 కుటుంబాల చేరిక
- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరిన వివిధ పార్టీల కుటుంబాలు
- రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : మెచ్చా
అశ్వారావుపేట, నవంబర్ 25 (మహా) : వినాయకపురం గ్రామపంచాయతీ పరిధిలోని దిబ్బగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు పార్టీలో చేరాయి. అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి మెచ్చా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. హామీల అమలు పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, గ్రామస్థాయిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణ, ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జూపల్లి రమణారావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మాజీ మండల అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్నబాబు, మోహన్‌రెడ్డి, సంక ప్రసాద్, కలపాల బాబురావు, మాజీ ఎంపీటీసీ కన్నమ్మ, మాజీ సర్పంచులు నారం రాజశేఖర్, సాధు జ్యోత్స్నబాయి, చెన్నారావు, కొనకళ్ల రామలింగయ్య, జజ్జూరి ప్రసాద్, తుంపాటి రమేష్, ఆసిఫ్, రెహ్మాన్, బన్ను, సంతోష్, అమీర్, నాగు, వంశీ తదితరులు పాల్గొన్నారు.








