బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తేలేదు
మహా పత్రికతో సండ్ర వెంకటవీరయ్య
హైదరాబాద్, మహా
కాంగ్రెస్ లో తాను చేరే ప్రసక్తేలేదని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కాంగ్రెస్ లోకి సండ్ర? అంటూ బుధవారం మహాపత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించగా, ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని, తాను ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, తనకు పార్టీ మారే ఉద్దేశంలేదన్నారు. తనకున్న ప్రజాదరణ గిట్టక ఇటీవల కాలంలో అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను బిఆర్ఎస్ ను వీడే ప్రసక్తేలేదన్నారు.
……………….
Post Views: 4,393