దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్, బిహార్ గవర్నర్గా అరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్లను నియమించారు.
గవర్నర్ల నియామకాలు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్చేశారు. తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు.
Post Views: 48







