Mahaa Daily Exclusive

  రెల్లి కులస్తులను గుర్తించాలి…. !

Share

దశాబ్దాల తరబడి అంటరాని తనం,అస్పృశ్యతల కారణంగా సామాజిక వెనుకబాటుకు గురైన రెల్లి కులస్తులను గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్.సి. రిజర్వేషన్ ఏక సభ్య కమిషనర్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అనాదిగా రెల్లి కులాలు విద్య, ఉద్యోగ,ఉపాధి, రాజకీయ రంగాలలో ప్రవేశ అర్హతను కూడ
నోచుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాయని వివరించారు.సఫాయి కర్మచారి వృత్తినే ప్రధాన ఉపాధిగా,మురికి
కాలువలు,గుంటలు,చెత్త కుప్పలు,లెట్రిన్లు శుభ్రం చేస్తూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా సమయంలో రెల్లి
కులస్థుల సేవలు ప్రజా ప్రశంసలు పొందాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర,ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రెల్లి ఉపకులాలు, దళితులలోనే అత్యంత దయనీయ
స్థితిలో ఉన్నారని జస్టిస్ రామ చంద్రరాజు ఎస్.సి. కమిషన్ విచారణ ద్వారా గుర్తించారన్నారు.2000-2004 మధ్య రెల్లి గ్రూపునకు సంపూర్ణ న్యాయం జరగలేదన్నారు.ఒక ప్రాంతంలో రెల్లి మహిళ/పురుషుడు కోటా భర్తీ కానప్పుడు ఆ
ఖాళీని వేరే ప్రాంత రెల్లి గ్రూపు వారిచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.రెల్లి గ్రూపు కోటా రెల్లి వారే అనుభవించేలా
జీవో సవరణ చేయాలని కోరారు. తమ సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించిన పక్షంలో పోరాటలే శరణ్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం నాయకులు భజంత్రీ శ్రీనివాసరావు, భౌరశెట్టి శ్రీనివాసరావు, అర్జీ సురేష్, ధనియాల ఈశ్వరరావు, లావేటి ప్రవళిక, కసింకోట నాగేంద్ర,అల్లం సాయి, అర్జీ రమణమూర్తి, అల్లం హనుమంతు, కోన విజయ్, కాకి రాజు, బొత్స రాజేష్ రాజేష్, ధనియాల అమర్, సింగంపల్లి దుర్గారావు, భూపతి అప్పారావు, కాకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest