ఏపీలో జనసేనలో చేరాల్సిన అవసరం లేదని వైసీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని తమ్మినేని వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్ఛార్జిని పెట్టడంతో పార్టీ పై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Post Views: 78








