Mahaa Daily Exclusive

  ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నేటితో ముగియనున్న నీరబ్ పదవీ కాలం

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ గా విజయానంద్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలలో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.

Latest